వాలాబులో జీడి తోటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వాలాబులో జీడి తోటల పరిశీలన

Mar 25 2026 7:22 AM | Updated on Mar 25 2026 7:22 AM

జీడి రైతులతో మాట్లాడుతున్న ఉద్యాన శాఖ అధికారి కిరణ్మయి

దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారి కిరణ్మయి, గరిశింగి సచివాలయ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ శరత్‌కుమార్‌ మంగళవారం పర్యటించారు. ఇక్కడ మంచు, తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని సోమవారం గిరిజన రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం విదితమే. దీనిపై ఉద్యానవన శాఖ అధికారులు స్పందించారు. దెబ్బతిన్న జీడి పంటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బీటీ దొర, జీడి రైతులు బలిజ నాగేశ్వరరావు, కధల రాము, కూడ దేముడు, సోమల కృష్ణ, దుప్పి సోమయ్య, పంది రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement