డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న
అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు
అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో చిన్నపాటి రోడ్డు ప్రమాదాలకు శాఖ డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ విధులు నుంచి తొలగించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున డిపోలో డ్రైవర్ కె.శ్రీనుపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహిస్తూ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్ శ్రీనును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 1/2019 సర్క్యులర్‌కు విరుద్ధంగా డిపో అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


