రోలుగుంట : కొబ్బరిచెట్టు పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరవోలు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా శ్యామ్(20) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కొబ్బరికాయలు తీసేందుకు చెట్టెక్కి ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు విశాఖ కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్‌ఐ రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తండ్రి దేముడు, తల్లి రాజేశ్వరి, చెల్లి కుమారి ఉన్నారు.


