రూ.కోటి గంజాయి పట్టివేత
8లో
ఏటీఎం కార్డుల దొంగ దొరికాడు
నర్సీపట్నం : రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.1.19 కోట్ల విలువైన 168 కిలోల గంజాయిని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. గంజాయి కేసుల్లో పాతనేరస్తుడు గుళ్లుపల్లి హరిబాబు రెండు బొలెరో వాహనాల్లో ప్రత్యేక అరలు అమర్చి గంజాయి రవాణా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు, సిబ్బంది నాతవరం మండలం, వెదురుపల్లి వద్ద మాటు వేసి పట్టుకున్నారు. వంతల దావీద్(30), బి.ప్రభాకర్‌రావు(30), వీరవల్లి దుర్గారావు(30), కొర్రా బొనంజబాబు(50)ను అరెస్ట్ చేశామన్నారు. మరో ఇద్దరు వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. ఒడిషా సరిహద్దుల్లో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడు తీసుకువెళ్తున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు.


