15 కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

15 కిలోల గంజాయి పట్టివేత

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్‌ (ఆర్‌ఐ) టీం

పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్‌ వద్ద సెక్యూరిటీ వింగ్‌(ఆర్‌ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్‌ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్‌ డాగ్‌ సహాయంతో రైల్వే స్టేషన్‌ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement