న్యూస్‌రీల్
అనకాపల్లి: రాగల ఐదురోజులలో ఆకాశం మేఘావృతమై పొడిగా ఉంటుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అర్హులకు ఓటు హక్కు కల్పించండి
విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం నూతన ఎన్నికలకు సంబంధించి చాలా మంది న్యాయవాదులు ఓటు హక్కును కోల్పోయారు. సరైన సమాచారం లేని కారణంగా పలువురు న్యాయవాదులు తాము చెల్లించవలసిన సభ్యత్వ రుసుము చెల్లించలేదు. ఈనెల 23లోపు సభ్యత్వ రుసుం చెల్లించాలని న్యాయవాద సంఘం గడువు విధించింది. ఈ లోపు న్యాయవాదులు క్రీడా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడంతో పలువురు న్యాయవాదులు తమ సభ్యత్వం చెల్లించలేకపోయారు. మార్చి 23వ తేదీ లోపు సభ్యత్వ రుసుం చెల్లించలేని వారికి ఓటు హక్కు లేదని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ఓటు హక్కు కల్పించడం కనీస ధర్మమని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము గడువు ఈనెల 6వ తేదీ వరకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని.. అవసరమైతే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సూచించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు మాట్లాడుతూ అర్హులైన అందరి న్యాయవాదులకు ఓటు హక్కు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సాక్షి, అనకాపల్లి :
పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి యుద్ధ మేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వైపు నిత్యవసర ధరలు పెరగడం..మరో వైపు గ్యాస్ ట్రబుల్‌తో జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. వంట నూనె నుంచి పప్పుదినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంటనూనె రేట్లు పెరగడంతో వినియోగదారులు, రెస్టారెంట్లు, హోటల్స్‌లో, పాస్ట్‌ఫుడ్ సెంటర్లలో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ ట్రబుల్‌తో ఇబ్బందులు పడుతున్నారు.
సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్‌కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటని ప్రశ్న ఉత్పన్నమైనా పెరిగిన రేట్లతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు.. మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. గ్యాస్ రేట్లు పెరగడం కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు, బొగ్గులు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి.
ధరల మంటకు కారణాలు ఇవే..
గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యవసర వస్తువులు, వంట నూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
కృత్రిమ కొరతతో సామాన్యుల నిలువుదోపిడీ
అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్‌ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్‌ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదనుగా రిటైర్ వ్యాపారులు కిరాణా వస్తువులను కూడా పెంచారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 10 వేల కేజీల నూనె వినియోగం జరుగుతున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు రూ.6 నుంచి రూ.10 పెరిగాయి.పామాయిల్‌లో రూ.90 –115 నుంచి రూ.120–140 వరకూ పెరిగింది.సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 140–160 నుంచి రూ.166–178 వరకూ పెరిగింది.
●జిల్లాలో 300 వరకూ ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచి, పాయకరావుపేట, చోడవరం, సబ్బవరం, ఎస్.రాయవరంలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వేరుశనగ, నువ్వుల నూనెలు తయారవుతాయి. ఇవి మిల్లుల ద్వారా 3 వేల కేజీలకు పైగా వినియోగం అవుతున్నాయి.
జిల్లాలో పెరిగిన ధరల వివరాలు ఇలా...
వంటింటికి
ధరల సెగ


