పాఠశాలల్లో సదుపాయాల పరిశీలన
కశింకోట: టెన్త్ పరీక్షలు నిర్వహించే డీపీఎన్ జెడ్‌పీ హైస్కూలు, బాలికల హైస్కూళ్లను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎ. శ్రీధర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, బెంచులు, విద్యుత్, తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు ప్రసాద్, ఎంఎస్ స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


