కూటమి నేతల కబ్జా పర్వం
సందరయ్యపేట పంచాయతీలో
జేసీబీతో చదును చేస్తున్న కొండ
అనకాపల్లి టౌన్: కూటమి ప్రభుత్వంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, కొండలను ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారు. మండలంలోని సుందరయ్య పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ పక్కన ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొండను అక్రమార్కులు శుక్రవారం పట్టపగలే జేసీబీలతో తొలిచేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమ భూములుగా భావిస్తూ ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.


