రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 3న విశాఖ కై లాసగిరిలోని పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన అండర్–17 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో కె.ప్రమోదిని, 1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంలో టి.మాధురి, 1500 మీటర్ల పరుగు పందెంలో ఎల్.ఉమ సత్తా చాటారు. ఈ నెల 6న ఆనందపురం హైస్కూల్‌లో జరిగిన అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.జాన్ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే జట్టులో సభ్యునిగా ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 22, 23 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నట్లు పీఈటీలు కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు తెలిపారు. సత్తా చాటిన విద్యార్థులను పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్, ఉపాధ్యాయులు బి.శివప్రసాద్, సూర్రెడ్డి బాబూరావు, పీఎంసీ కమిటీ చైర్మన్ కిల్లి సింహాచలంనాయుడు, సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, ఎంపీటీసీ లెక్కల గౌతమి అభినందించారు.
దొండపూడి స్కూల్ విద్యార్థి ప్రతిభ
రావికమతం: మాకవరిపాలెం మండలంలో శుక్రవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీల్లో దొండపూడి హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొంకిపూడి కీర్తన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. కీర్తన అండర్ –14 విభాగంలో సాఫ్ట్ బాల్ విభాగంలో సత్తా చాటింది. ఈ మేరకు ఆమెను వ్యాయామ ఉపాధ్యాయుడు సిహెచ్.ఆనంద్, పాఠశాల హెచ్‌ఎం బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


