రోగుల హాహాకారాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు వార్డుల్లో రోగులు హాహాకారాలు పెట్టారు. గైనిక్ వార్డులో బాలింతలు, డెలివరీ కోసం లేబర్ రూమ్‌లో ఉన్న గర్భిణులు, పిల్లల వార్డులో బరువు, నెలతక్కువతో పుట్టిన పిల్లలు, వివిధ సమస్యలతో ఉన్న చిన్నారులు, వెంటిలేటర్ మీద ఉన్న రోగులు, ఎమర్జన్సీ వార్డుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పిల్లల పరిస్థితి చూసిన తల్లులు.. రోగుల పరిస్థితి చూసిన వారి బంధువులు అల్లాడిపోయారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో గాయపడిన రోగులు, ఆక్సిజన్ పెట్టుకున్న రోగులు విద్యుత్ లేకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. పిల్లలు, గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్ తదితర వార్డుల్లో ఫ్యాన్లు నిలిచిపోవడంతో రోగుల బంధువులు విసనకర్రలను ఆశ్రయించారు. నర్సులు రోగులకు కొవ్వొత్తుల వెలుగులోనే వైద్య సేవలు అందించారు.


