అమరావతి మాక్ అసెంబ్లీకి కాశీపురం విద్యార్థిని
దేవరాపల్లి: కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సింగంపల్లి వెంకట సాయి మేఘన అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో విద్యార్థ్ధులకు వ్యక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. మాడుగులలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలలో వెంకట సాయి మేఘన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.‘మేకింగ్ ఇండియా– వికసిత్ ఆంధ్రప్రదేశ్’, భారత రాజ్యాంగ ఆవశ్యకత, పౌరుల హక్కులు, విధులు తదితర అంశాలపై ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించి మాడుగుల నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీకి అర్హత సాధించింది. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని శాసనసభలో జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో వెంకట సాయి మేఘన పాల్గొంటుందని స్థానిక హెచ్‌ఎం రాజేటి సుజాత తెలిపారు. ఎంపికై న విద్యార్ధినితో పాటు గైడ్ టీచర్ కొట్టాన రాంబాబును మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్.ఉమ, వి. ఉషారాణి, హెచ్‌ఎం సుజాత అభినందించారు.


