
‘ఆర్‌ఈసీఎస్’ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బందికి బకాయిల చె
కశింకోట: ఆర్‌ఈసీఎస్‌కు అనుబంధంగా ఉన్న రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు, నిర్వహణ ఖర్చులను చెల్లించారు. జీతాలు అందక రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది గత మూడు నెలలుగా పడుతున్న ఇబ్బందిపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురించిన వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, కలెక్టర్ విజయ కృష్ణన్‌ల ఆదేశాలతో 8 నెలల జీతం బకాయిలు, ఇతర నిర్వహణ ఖర్చులను తాజాగా చెల్లించారు. దీంతో అధ్యాపక, సిబ్బంది, విద్యార్థులు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు.