
విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
మాకవరపాలెం: బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్‌పిఎస్ నేతలు చిందాడ నూకేశ్వరరావు, మల్లిబాబు డిమాండ్ చేశారు. తాడపాలలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ధ్వంసంపై మంగళవారం గ్రామస్తులతో కలసి ఎస్‌ఐ దామోదర్‌నాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్దే ఉండడం చూసినట్టు చెప్పారు. నలుగురు వ్యక్తుల పేర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.