బీఎన్‌ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు | - | Sakshi
Sakshi News home page

బీఎన్‌ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు

Oct 22 2025 6:58 AM | Updated on Oct 22 2025 6:58 AM

బీఎన్‌ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు

బీఎన్‌ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు

బుచ్చెయ్యపేట: మండలంలో వడ్దాది నుంచి నర్సీపట్నం పోవు బి.ఎన్‌.రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో బురదలో కూరుకు పోయింది. ఈ రహదారిలో బంగారుమెట్ట నుంచి ఎల్‌బీపురం మధ్య చర్చి వద్ద రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ గోతిలో కూరుకునిపోవడంతో చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వైపు వచ్చే బస్సులు, లారీలు, ఇతర ప్రెవేటు వాహనాలు సుమారు 1 కిలోమీటరు మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ రహదారి నరకం చూపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement