
ప్రభంజనంలా కోటి సంతకాల సేకరణ
మునగపాక: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మంగళవారం మునగపాకలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరైన 17 మెడికల్ కళాశాలల్లో ఏడు నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్య కళాశాల అనువుగా ఉండేలా, సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి నిర్మాణాల ద్వారా మెరుగైన వైద్య సేవలందించేలా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారన్నారు. ఇటీవల మాకవరపాలెంలో మెడికల్ కళాశాలను సందర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా భారీగా ప్రజలు, కార్యకర్తలు రావడం సంతోషకరమన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇదే నిదర్శనమన్నారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌కు అందజేయనున్నామన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ మండలంలోని 10 వేల నుంచి 15 వేలకు తగ్గకుండా సంతకాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మునగపాక మండలంలో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగాలన్నారు.
పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, సర్పంచ్‌లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, సుందరపు తాతాజీ, కర్రి పెదబ్బాయి, కారుకొండ రాజు, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, ఇల్లా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, బోడకుర్తి గణేష్, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, షేక్ ఇస్మాయిల్, దొడ్డి బాలాజీ, బొద్దపు శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభంజనంలా కోటి సంతకాల సేకరణ

ప్రభంజనంలా కోటి సంతకాల సేకరణ