
అద్భుతం.. నృత్యోత్సవం
వైద్య కళాశాలల ప్రైవేట్‌పరంపై 14న బహిరంగ చర్చ
అల్లిపురం: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన 17 వైద్య కశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడం, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో 14న బహిరంగ చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ తెలిపారు. బహిరంగ చర్చలో వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, న్యాయవాద సంఘాలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు.
కూచిపూడి నృత్య ప్రదర్శనలో చిన్నారులు
మద్దిలపాలెం(విశాఖ): కళాభారతిలో పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం 96వ జయంతిని పురస్కరించుకుని విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ , వెంపటి చిన్న సత్యం స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రం సంయుక్తంగా రెండు రో జుల ఆంధ్రప్రదేశ్ శాసీ్త్రయ సంప్రదాయ నృత్యం, కూచిపూడి వెంపటి జయంతి నృత్యోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు కార్యక్రమంలో సుమారు 400 మంది చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. నగరంలో గల నాట్య గురువులందరి సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సెంచురియన్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు, వీఎండీఏ అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్ రాజు, విజయనిర్మన్ అండ్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, విజయనిర్మల కంపెనీ చైర్మన్ ఎంఎస్ శ్రీనివాస్, కూచిపూడి కళాక్షేత్ర కార్యదర్శి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు ఏదో ఒక సంప్రదాయ నృత్యం, సంప్రదాయ కళ నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని నాట్య గురువులను సత్కరించారు.
డీఎస్‌డీవోగా పూజారి శైలజ
యలమంచిలి రూరల్: జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా విశాఖపట్నం వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా పని చేస్తున్న పూజారి శైలజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అనకాపల్లి డీఎస్‌డీవో(కాంట్రాక్టు)గా విధులు నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్స్ శిక్షకుడు ఎల్‌వీ రమణను విజయవాడ శాప్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.