
వైఎస్ జగన్ దృష్టికి మత్స్యకారుల ఆందోళన
నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు
నక్కపల్లి: రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 25 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం నక్కపల్లిలోని పార్టీ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల సందర్శనకు వస్తున్న వైఎస్ జగన్‌ను గురువారం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, మత్స్యకార నాయకురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మత్స్యకార నాయకుడు ఎరిపల్లి నాగేశు తదితరులతో కలిసి, వినతిపత్రం అందజేస్తామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కలిగే నష్టాన్ని తమ అధినేతకు వివరించి, మద్దతు కోరతామన్నారు. మత్స్యకారుల సమస్యలపై వైఎస్ జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, మత్స్యకారులు తరలిరావాలని వారు కోరారు.