
మాజీ సీఎం జగన్ పర్యటన ఇలా..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, పెందుర్తి, సబ్బవరం–అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా కొత్తూరు జంక్షన్.. అక్కడ నుంచి తాళ్లపాలెం జంక్షన్ మీదుగా మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ కళాశాలను పరిశీలించి 1.30 నుంచి 2.15 గంటల వరకు మీడియాతో మాట్లాడతారు. అనంతరం విశాఖలోని కేజీహెచ్‌కు 4 గంటలకు చేరుకుంటారు. కురుపాం గిరిజన ప్రభుత్వ వసతి గృహంలో అస్వస్థతకు గురై ఇక్కడ చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 6 గంటలకు చేరుకొని విమానంలో తిరుగుపయనమవుతారు.