
పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఏర్పాట్లపై చర్చిస్తున్న బొత్స, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు
మాకవరపాలెం: మెడికల్ కళాశాల భవనాలను సందర్శించేందుకు గురువారం భీమబోయినపాలెం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రుల బృందం పరిశీలించింది. వైఎస్ జగన్ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాఽథ్, మాజీ మంత్రి విడదల రజని, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌లతో కలిసి బొత్స ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకురాలు శోభా హైమావతి, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు.