ఎన్‌–బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌–బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు

Oct 9 2025 3:05 AM | Updated on Oct 9 2025 3:05 AM

ఎన్‌–బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు

ఎన్‌–బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలకు ముప్పు

● కల్తీ మద్యంపై వైఎస్సార్‌సీపీ మహిళల ధర్నా ● ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద బాటిళ్లు ధ్వంసం

బీచ్‌రోడ్డు (విశాఖ): రాష్ట్రంలో ‘నారా వారి సారా’, ‘ఎన్‌ బ్రాండ్‌ లిక్కర్‌’తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి కల్తీ మద్యంను తక్షణమే అరికట్టాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆదేశాల మేరకు బుధవారం సిరిపురంలోని జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో లేని మద్యం కల్తీ ఉందని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తోందని మండిపడ్డారు. కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ పట్టుబడిన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మొదటి నుంచి ఇటువంటి కల్తీ మద్యం వ్యాపారాలు, లిక్కర్‌ స్కాములు సర్వసాధారణమని ఆమె ఆరోపించారు. 2014–19 మధ్యలో కూడా వేల కోట్లకు పైగా లిక్కర్‌ స్కామ్‌కు టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. ప్రస్తుతం దానికి మించి లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోందని, ఇటీవల పట్టుబడిన కల్తీ మద్యం తయారీ కేంద్రమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్కామ్‌లు లేకపోయినా.. అక్రమంగా తమ పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయితే న్యాయం తమ వైపే ఉంది కాబట్టి కోర్టుల ద్వారా వారు విముక్తి పొందారని రమణికుమారి గుర్తుచేశారు. మహిళల తాలి బొట్టులతో ఆటలాడుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లే అనురాధ, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు రాధ, కార్పొరేటర్‌ శశికళ, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నాయకులు భాను, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, తూర్పు, దక్షిణ, గాజువాక మహిళా విభాగం అధ్యక్షులు శిరీష, బంగారమ్మ, పల్లా చిన్నతల్లి, టీచర్స్‌ విభాగం ప్రతినిధులు కల్పన, జ్యోతి, పద్మావతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement