
ఆటో, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు
రావికమతం: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో యువకుడికి గాయాలయ్యాయి. మండలంలో గర్నికం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పి.పోన్నవోలు పంచాయతీ కుముందానపేట గ్రామానికి చెందిన మారబోయన నాగ శ్రీను కుడి కాలు విరిగిపోయింది. నర్సీపట్నం నుంచి రావికమతం వస్తున్న ఆటో గర్నికం వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో శ్రీను గాయపడ్డారు. క్షతగాత్రుడిని హుటాహుటిన రావికమతం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది శ్రీనుకు ప్రథమ చిక్సిత చేసి కాలు విరిగిందని నిర్థారించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు.