తీరంలో లభ్యమైన అశోక్ మృతదేహం
పాయకరావుపేట: మండలంలోని పాల్మన్‌పేట సముద్రతీరంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ జె.పురుషోత్తం తెలిపారు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు పి.అశోక్ సోమవారం సముద్ర స్నానం చేస్తుండగా కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు.
అతని మృతదేహం మంగళవారం ఉదయం పాల్మన్‌పేట బీచ్‌లోనే లభ్యమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.