
మహర్షి వాల్మీకి ఆలోచనలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి/తుమ్మపాల: మహర్షి వాల్మీకి ఆలోచనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో వాల్మీకి చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అలాగే స్థానిక ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికి నిత్యనూతనంగా మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. వాల్మీకి జీవితం సమానత్వం, ధర్మం, న్యాయం, శాంతి వంటి విలువలకు ప్రతీక అన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు టి.లక్ష్మి, ఎస్.బాల సూర్యరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, బోయ కమ్యూనిటీ నాయకులు ఆదినారాయణ, జయకృష్ణ, అంగులురి శ్రీను, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.

మహర్షి వాల్మీకి ఆలోచనలు స్ఫూర్తిదాయకం