
అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల బియ్యం స్వాధీనం
విజిలెన్సు అధికారులు పట్టుకున్న బియ్యం
నాతవరం: లారీపై అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. మండలంలో నర్సీపట్నం–తుని మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఎం.బి.పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం సమీపంలో నర్సీపట్నం వైపు నుంచి లారీపై తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నట్టు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లఘించి తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డి.యర్రవరం పౌరసరఫరాల గిడ్డంగికి తరలించినట్టు చెప్పారు. అక్కడ సివిల్ సప్లైడిప్యూటీ తహశీల్దార్ చందన లేఖ ఆధ్వర్యంలో తూకం వేసి, అప్పగించామన్నారు.ఈసంఘటనపై 6ఏ కేసు నమోదు చేసినట్టు డీటీ చందనలేఖ విలేకరులకు తెలిపారు.