
‘రైవాడ’ నుంచి 1000 క్యూసెక్కుల నీరు విడుదల
దేవరాపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 950 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో జలాశయం స్పిల్ వే గేటు ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.90 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వలతో జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. ఇన్‌ఫ్లో ఆధారంగా గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని, శారదానది పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయం డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు.