
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
రావికమతం: మండలంలోని పి.పొన్నవోలు సమీపంలో బి.ఎన్.రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంట మండలం కొమరవోలుకు చెందిన బండారు మనో వరాహ వినయ్,వంటాకుల మదన్‌కుమార్,బండారు తేజ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై రావికమతం వైపు నుంచి స్వ గ్రామం కొమరవోలు వెళుతున్నారు.అదే సమయంలో టి.అర్జాపురానికి చెందిన ఆర్.జనార్దన్,మత్సవానిపాలెంకు చెందిన ఆదాడ సాయి ద్విచక్ర వాహనంపై మేడివాడ వైపు వెళున్నారు. పి.పొన్నవోలు దగ్గర ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గాయపడ్డారు.కొమరవోలుకు చెందిన యువకులు విశాఖ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు.మత్సవానిపాలెం యువకుడు నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో, టి.అర్జాపురానికి చెందిన యువకుడు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.