
కొనసాగుతున్న నిర్బంధాలు
● 22వ రోజుకు చేరిన మత్స్యకారుల దీక్ష
● సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలకు అడ్డంకులు
నక్కపల్లి/ఎస్.రాయవరం: రాజయ్యపేట సమీపంలో బల్క్‌డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్ష ఆదివారం 22వ రోజుకు చేరుకుంది. వారికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నాయకుల నిర్బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ మత్స్యకారుల దీక్షకు మద్దతుగా రాజయ్యపేట వస్తుంటే రాజమండ్రి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనకుండా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో ఇంటి వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బల్క్‌డ్రగ్ పార్క్‌కు మద్దతుగా రాంబిల్లిలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నక్కపల్లి: రాజయ్యపేట వస్తున్న బోడే రామ చంద్రయాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు
ఎస్.రాయవరం: ధర్మవరం అగ్రహారంలో సీపీఎం నాయకుడు అప్పలరాజు గృహ నిర్బంధం

కొనసాగుతున్న నిర్బంధాలు