
నిర్వాసితుల వేదన... అరణ్య రోదన
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్‌నిర్మాణంలో భాగంగా ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలు ఇచ్చిన నిర్వాసితుల వేదన అరణ్య రోదనగా మారుతోంది. సమస్యలు పరిష్కరించకుండానే గ్రామాలను ఖాళీ చేయించి, 745 మందిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరో పక్క పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చి, పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే తాము ఇక్కడ నుంచి కదులుతామని పలు గ్రామాల ప్రజలు ఖరాఖండీగా చెబుతున్నారు. మరో పక్క ఇప్పటికే బల్క్‌డ్రగ్ పార్క్ పనులు ప్రారంభం కాగా, మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభం కానుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
డీఎస్పీ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్, పార్టీ నాయకులు
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం, భీమబోయినపాలెంలోని మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని, ఆ పర్యటనలో బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, షెడ్యూల్ త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. గణేష్ వెంట వైఎస్సార్‌సీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు చిటికెల రమణ, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ నాయకులు మాకిరెడ్డి బుల్లిదొర, బొడ్డు గోవిందరా వు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, రుత్తల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలని
వేడుకుంటున్నా పట్టని ప్రభుత్వం
డిమాండ్లు తీర్చకుండానే పునరావాసానికి తరలించేందుకు చర్యలు
745 మందిని ఖాళీ చేయించేందుకు సన్నాహాలు
ససేమిరా అంటున్న పలు గ్రామాల ప్రజలు
అధికారులు మల్లగుల్లాలు

నిర్వాసితుల వేదన... అరణ్య రోదన