
చలనం లేని ప్రభుత్వం
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం తిరగని రోజు, వెళ్లని కార్యాలయం లేదు.అయి నా ప్రభుత్వంలో చలనం లేదు. ఆరునెలల నుంచి పోరాటం చేస్తున్నా పట్టించుకోలేదు. నిర్వాసితులు సర్వం కోల్పోయి కొత్త ప్రాంతంలో నివాసముండాలంటే అన్ని సదుపాయాలు ఉండాలి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.8.98 లక్షలు ఏ మాత్రం సరిపోదు. ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే. కటాఫ్ తేదీ మధ్యలో వివాహమైన ఆడపిల్లలకు ప్యాకేజీ వర్తింపజేస్తేనే నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేస్తారు.
– తళ్ల భార్గవ్,
వైఎస్సార్‌సీపీ నాయకుడు, చందనాడ