
పాటిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ సందర్శన
మునగపాక: మండలంలోని పాటిపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను శనివారం జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు సందర్శించారు. కేంద్రం ద్వారా అందుతున్న రోజువారీ సేవలతో పాటు మాతా శిశు సేవలను, రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు,కిషోర్ బాలికల గృహాలను సందర్శించారు. బృందం సభ్యులు కె.జగదీష్, జిల్లా గణాంకాధికారి ఎ.రామచంద్రరావు, డేటా మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సూచన మేరకు మందులు వేసుకోవాలని తెలిపారు. కిల్కారీ సేవలపై అవగాహన కల్పించారు. సీహెచ్‌వో దేవకాంత, సూపర్‌వైజర్లు వీఎస్‌ఎం లక్ష్మి,ఎం.నాగేశ్వరరావు, ఎంఎల్‌హెచ్‌పీలు యామిని, దీన, వినీల, దుర్గ పాల్గొన్నారు.