
‘ఆటో డ్రైవర్ల సేవలో’ ప్రారంభం
పథకం ప్రారంభోత్సవంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు
రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్
నర్సీపట్నం: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని స్థానిక మార్కెట్‌యార్డ్‌లో శనివారం ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్, ఆర్‌డీవో వెంకట రమణ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథథకం చెక్కును స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 13,753 మంది డ్రైవర్లకు సుమారు రూ. 20.62 కోట్లు లబ్ధి చేకూరింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఆటో సోదరుడు సంతోషంగా ఉండాలనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ విజయకృష్ణను మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న నగదును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.