
గంజాయితో వ్యక్తి అరెస్టు
గంజాయి నిందితుడితో ఎస్‌ఐ తారకేశ్వరరావు
నాతవరం: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో తాండవ జంక్షన్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగ్‌లో ఉన్న గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన బీజీల్‌దేవ్‌ప్రసాద్‌ను అరెస్టు చేసి, రెండు కిలోల 8 గ్రామాల గంజాయి, ఒక సెల్ పోన్ స్వాఽఽధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.15వేలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.