
మారిన జీఎస్టీ ప్రకారం బిల్లులు ఇవ్వాలి
నర్సీపట్నం: ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని, అందుకు అనుగుణంగా ధరలు తగ్గించి, వ్యాపారులు బిల్లు ఇవ్వాలని నర్సీపట్నం లీటల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ డి.అనురాధ అన్నారు. మండలంలో వేములపూడి గ్రామంలో బుధవారం వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారిన జీఎస్టీ స్లాబ్‌లకు అనుగుణంగా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసుకోవాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నర్సీపట్నంలోని ఒకరిద్దరు హోల్‌సేల్ వ్యాపారస్తుల వద్ద నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నామని, మారిన జీఎస్టీతో కొన్న వాటికి బిల్లు అడిగినప్పటికీ ఇవ్వటం లేదని రిటైల్ వ్యాపారులు అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. హోల్‌సేల్, సూపర్ మార్కెట్, రిటైల్ వర్తకులు ఎవరైనా అమ్మిన ప్రతి వస్తువుకు మారిన జీఎస్టీ స్లాబ్‌ల ప్రకారం బిల్లు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశా రు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వెంటనే ఫిర్యా దు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.