
ఏఆర్‌కే బార్‌లో మద్యం అక్రమ నిల్వలు
యలమంచిలి రూరల్: పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనున్న ఏఆర్‌కే బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం అక్రమ నిల్వలను యలమంచిలి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బార్‌కు సంబంధంలేని నంబర్లతో ఉన్న 10 మద్యం సీసాల కేసులు, 8 బీరు సీసాల కేసులను గుర్తించినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వి.సుధీర్ తెలిపారు. ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది బార్‌లో తనిఖీలు చేయగా అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్లలో వివిధ బ్రాండ్లు ఉండడంతో ఒక్కో బ్రాండ్‌కు ఒకటి చొప్పున శాంపిళ్లను రసాయన విశ్లేషణ నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై యలమంచిలి అబ్కారీ శాఖ స్టేషన్‌లో క్రైం నెంబరు 69/2005తో కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఈ బార్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు స్టేషన్‌కు చెందిన బొలెరో వాహనంలో మద్యం సీసాలు, బీర్లను తీసుకెళ్లారు. అయితే ఈ విషయం బుధవారం సాయంత్రం వరకు మీడియాకు తెలీకుండా రహస్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిచ్చింది.