
అంతరించిపోయిన గుర్రాల సంత
దసరా రోజున మాడుగులలో గుర్రాల సంత జరిగేది. దేశంలో హంపీ విజయనగరం తర్వాత మాడుగులలోనే గుర్రాల సంత జరిగేది. యుద్ధానికి పనికి వచ్చే కావ్వాడ్, సుడేధార్ రేస్ తదితర ఖరీదైన గుర్రాలు మాడుగులకు వచ్చేవి. రాజుల పాలన ముగిసినా సరే అదే సంప్రదాయంతో గుర్రాల క్రయ విక్రయాలు జరిగేవి. దసరా ముందు మూడు రోజు వెనుక రెండు రోజులు ఐదు రోజులు సంత జరిగేది. బరువులు మోసే గుర్రాలు వేలాది సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవి. విశాఖ ఏజెన్సీకి రహదారులు లేని సమయంలో వీటిని ఏజెన్సీ పంటలను దిగువకు తరలించడానికి వినియోగించేవారు. రోడ్లు నిర్మించి, బస్సులు ఇతర వాహనాలు అందుబాటులోకి రావడంతో గుర్రాల వాడకం తగ్గిపోయింది. గత మూడేళ్ల నుంచి గుర్రాల సంత జరగడం లేదు.