
తల్లిని మించిన తనయ సాహితి
రోలుగుంట: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహస బాలిక అవార్డు గ్రహీత సాహితీలను నర్సీపట్నంలోని వాసవీ క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో క్లబ్ రీజినల్ చైర్మన్ వెలగా నారాయణ దంపతులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ నాగజ్యోతికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె కుమార్తె సాహితీ తల్లిని మించిన తనయగా స్విమ్మింగ్‌లో అనేక పురస్కారాలు పొందారన్నారు. రేవు పోలవరంలో తీరంలో ఒక వ్యక్తి ప్రాణాలు కాిపాడి సాహస బాలిక అవార్డు పొందడం ఆర్యవైశ్య వర్గానికే గర్వకారణమన్నారు. వాసవీ క్లబ్ అభివృద్ధికి తాము అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు తెలిపారు.