
పలు పాఠశాలల సందర్శన
రోలుగుంట/రావికమతం/బుచ్చియ్యపేట: భీమునిపట్నంలోని డైట్ కళాశాల అధ్యాపక బృందం సభ్యులు గురువారం మండలంలో పలు పాఠశాలలను సందర్శించారు. చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట, రావికమతం, బుచ్చియ్యపేట మండలాల్లోని పలు పాఠశాలలను పరిశీలించారు. రోలుగుంట మండలం కంచుగుమల, కొంతల గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించారు. విద్యా ప్రమాణాలను సమీక్షించారు. మూల్యాంకనం, గ్రేడింగ్, విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా తీశారు. సిలబస్ ఎంత వరకూ పూర్తయిందో తెలుసుకున్నారు. విద్యార్థుల నోట్ బుక్స్, రాత పరిశీలించి సామర్థ్యాలను అంచనా వేశారు. నాణ్యమైన బోధన, సమర్థవంతమైన అభ్యాసనపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. అధ్యాపకులు సిహెచ్.స్వామి, ఎస్.కె.అల్లాద్దీన్, ఎం.వి.రమణ. ఉదయ్ శేఖర్ పాల్గొన్నారు.