
మాజీ సీఎం జగన్‌ను కలిసిన బూడి, అనురాధ
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన అనురాధ
దేవరాపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను నియమించడం పట్ల ఈర్లె అనురాధ మాజీ సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఏ బాధ్యతను తనకు అప్పగించిన శిరసా వహిస్తూ, వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతుగా అహర్నిశలు కృషి చేస్తానని అనురాధ చెప్పారు. జిల్లా, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను మాజీ సీఎం జగన్ ఆరా తీసినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తెలిపారు.