
టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆర్‌జేడీ విజయ్ భాస్కర్
నక్కపల్లి: ఈ ఏడాది పదోతరగతి పరీక్ష ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆర్‌జేడీ విజయ్ భాస్కర్ అన్నారు. గురువారం నక్కపల్లిలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటినుంచే పదోతరగతి పరీక్షలపై దృష్టిపెడితే మంచి ఫలితాలుసాధించవచ్చని తెలిపారు. కేవలం పదోతరగతికే పరిమితంకాకుండా అన్ని తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు ప్రతి పాఠశాలను సందర్శించి పర్యవేక్షణచేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఈసమావేశంలో డీఈవో అప్పారావు నాయుడు, డీప్యూటీ డీఈవో పెన్నాడ అప్పారావు, ఎంఈవోలు కుంచం నరేష్, నాగన్న దొర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.