
ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్‌ను అడ్డుకుంటాం
నక్కపల్లి: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు... శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అణగతొక్కాలని ప్రయత్నిస్తోంది... ప్రాణాలకు తెగించైనా బల్క్‌డ్రగ్‌ను అడ్డుకుంటాం.. ఓట్లేసి గెలిపిస్తే హోంమంత్రి అనిత తమపట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారను కోలేదు’ అంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. బల్క్ డ్రగ్‌పార్క్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహారదీక్ష నాల్గో రోజు బుధవారం కొనసాగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెంట్లు వేసి, దీక్ష కొనసాగించేందుకు సిద్ధపడగా సీఐ కుమార స్వామి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు పర్మిషన్ లేదని, టెంట్లు వేయడానికి వీల్లేదన్నారు. దీంతో గంగపుత్రులు గొడుగుల నీడలో దీక్షను కొనసాగించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మత్స్యకారులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులవడానికి, జైలుకెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నామంటూ మత్స్యకార మహిళలు నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్, రైతు సంఘనాయకుడు సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు. ఎండలో మత్స్యకారులతో కలసి నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు
ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ మత్స్యకారులను కూటమిప్రభుత్వం దేశద్రోహులగా చిత్రీకరిస్తోందని, శాంతియుతంగా నిరాహరదీక్ష చేస్తున్న వారిపై ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. నాలుగు రోజులుగా రాజయ్యపేటలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు.తనను ఆదరించిన మత్స్యకారులను ఆదుకోకపోగా పోలీసుల సాయంతో ఉద్యమంపై హోంమంత్రి అనిత ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అసెంబ్లీసమావేశాలు ప్రారంభ కానున్నాయని, ఈ సమావేశాల్లో రాజయ్యపేటలో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావించి బల్క్‌డ్రగ్‌పార్క్ రద్దుచేసే విధంగా బిల్లు పాస్‌చేయాలని కోరారు. దేశంలో మూడు చోట్ల..గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ బల్క్‌డ్రగ్‌పార్క్‌లను పెడుతున్నామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పెడుతున్నారన్నారు. ఈ పార్క్ ఏర్పాటయితే పదుల సంఖ్యలో ప్రమాదకర రసాయన పరిశ్రమలు వస్తాయని, ఈ ప్రాంత మంతా శ్మశానంగా మారుతుందని చెప్పారు. పరిసర ప్రాంతాల వారు పలు వ్యాధులకు గురికావలసి వస్తుందని తెలిపారు. గంగపుత్రులు చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయమత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ ఇది ఒక్క రాజయ్యపేట మత్స్యకారుల సమస్య కాదని, తూర్పుతీరంలో ఉన్న అందరి సమస్య అని చెప్పారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తే పోలీసులు ఇష్టాను సారం వ్యవహరించి అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎండలో మహిళలు ఇబ్బంది పడుతుంటే టెంట్లు వేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మత్స్యకారులు తలచుకుంటే టెంట్లు వేయడం పెద్ద పనికాదని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నా రు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరిని ఏకం చేస్తా మని, త్వరలోనే ఇతరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ రాజయ్యపేట తీసుకు వచ్చి తమ సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. జాతీయమత్స్యకార సంఘ అధ్యక్షుడు, ఇతర మత్స్యకార పెద్దలను కలసి ఇక్కడి సమస్య వివరిస్తామన్నారు. ప్రాణాలకు తెగించైనా సరే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. రాజయ్యపేట మత్స్యకారులను హోంమంత్రి అనిత మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, ఉపాధ్యక్షుడు నాగేశు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల పోలీసుల వైఖరి సరికాదన్నారు. ఉద్యమానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్‌పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు సోమేష్, పిక్కి తాతీలు, పిక్కి కోదండరావు, మైలపల్లిసూరిబా బు, నారాయణరావు,కాశీరావు,మహేష్, రాజశేఖర్, యజ్జల అప్పలరాజు, కోడకాశీరావు, పైడితల్లి,నూకరాజు,వందలాదిమందిమహిళలు పాల్గొన్నారు.
మండుటెండలో
నాల్గోరోజు కొనసాగిన నిరాహార దీక్ష
సహనాన్ని పరీక్షించవద్దని
మత్స్యకారుల హెచ్చరిక
మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ,
సీపీఎం నేతలు

ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్‌ను అడ్డుకుంటాం

ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్‌ను అడ్డుకుంటాం

ప్రాణాలకు తెగించైనా బల్క్ డ్రగ్‌ను అడ్డుకుంటాం