
కౌలు రైతుకు కష్టం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
లైంగికదాడి కేసులో
నిందితుడికి రిమాండ్
విలేకర్లతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు
ఎస్.రాయవరం: బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, లైంగికదాడి చేసిన యువకుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో బుధవారం స్థానిక విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సింగన శ్రీను అదేగ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించి, లైంగికదాడి చేశాడని మంగళవారం ఫిర్యాదు అందినట్టు చెప్పారు. ఎస్.రాయవరం , అడ్డురోడ్డు సర్కిల్ పోలీసులు విచారణ జరిపి, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.ఈ సమావేశలో అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ,ఎస్.రాయవరం ఎస్‌ఐ విభీషణరావు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి కష్టాలు చెప్పనలవికానివిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. అన్నదాత సుఖీభవ పథకం మంజూరు చేయలేదు. పెట్టబడి సాయం అందక...అటు రుణాలు మంజూరుకాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందక కౌలు రైతులు నష్టపోతున్నా పాలక పెద్దల్లో మాత్రం కనీసం చలనం రావడం లేదని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: కౌలు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పట్టించుకోవడం లేదు. కనీసం ఎటువంటి సాయం అందించడం లేదు. కూటమి నాయకులు చెబుతున్న మాటలకు , క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. రైతన్న ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఎదురు దెబ్బలే చవిచూశాడు. ఎరువుల కొరత ఒక వైపు వేధిస్తుంటే..మరో వైపు కౌలు రైతులకు కనీసం ఎటువంటి సాయం అందడం లేదు. కుటుంబ పోషణకు పలువురు రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే పరవాలేదు. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయాలంటే వారికి పెట్టుబడి కావాలి. ఇందుకోసం వారు ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సాయంతో పాటు రుణ సాయం కూడా అందని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా సాధారణ రైతులు మాదిరిగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. దీంతో వారు పంటల సాగుకు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి తప్పింది. రైతు భరోసా కింద వారికి రూ. 13,500 చొప్పన ఇవ్వడం వల్ల వారు వాటిని విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు పెట్టుబడిగా ఉపయోగించుకునేవారు. అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
4,285 మంది దరఖాస్తు
అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో తొమ్మిదివేల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేశారు. వీరిలో 4,285 మంది కౌలు రైతులు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద సాధారణ రైతులకు రూ.ఏడు వేలు పెట్టుబడి సాయం అందించింది. వారితో పాటు తమకూ సాయం అందిస్తారని కౌలురైతులు ఆశగా ఎదురు చూశారు. సెప్టెంబర్ నెలాఖరుకు కూడా పెట్టిబడి సాయం అందకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్నివిధాలుగా సాయం అందడంతో సంతోషంగా సాగు చేసిన కౌలు రైతులు కూటమి పాలనలో అన్నింటికీ దూరమై కష్టాల నడుమ సాగు కొనసాగిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదువేలకు పైగా రైతులకు సాగు హక్కు కార్డులు అందించారు. ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున పెట్టిబడి సాయం మంజూరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కౌలు రైతులకు మొండి చేయి చూపించారు.
అమలు కాని అన్నదాత సుఖీభవ కూటమి పాలనలో జిల్లాలో 4,285 మందికి మొండి చేయి
కౌలు రైతులను గుర్తించాం..
జిల్లాలో కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. ఇప్పటికే నాలుగు వేల మంది వరకూ కౌలు రైతులు అర్హులుగా గుర్తించాం. గతంలో సీసీఆర్ కార్డు ఉన్నా..వారు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ వేస్తేనే కౌలుదారులుగా గుర్తిస్తాం. ప్రభుత్వ జీవో 33 ప్రకారం జిల్లాలో అర్హత ఉన్న కౌలు రైతులకు అక్టోబర్ నెలాఖరు నాటికి పెట్టుబడి సాయం అందిస్తాం. రెండు విడతలుగా ఈ సాయం అందజేస్తాం.
– మోహన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి

కౌలు రైతుకు కష్టం

కౌలు రైతుకు కష్టం