
మత్స్యకారుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఆర్‌డీవో వివి రమణ
మత్స్యకారుల తో మాట్లాడుతున్న ఆర్‌డీవో రమణ
నక్కపల్లి: బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరేకంగా మూడు రోజుల నుంచి మత్స్యకారులు చేస్తున్న ఆందో ళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి. రమణ తెలిపారు. మంగళవారం ఆయన రాజయ్యపేటలో పర్యటించి, నిరాహారదీక్ష శిబిరం వద్దకు వెళ్లారు. బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటయితే ఈ ప్రాంత మంతా కాలుష్యమవుతుందని, ప్రజలు క్యాన్సర్,కిడ్నీసమస్యలు వంటి రుగ్మతలతో బాధపడతారని, ప్రజలప్రాణాలకు హానికలిగించే ఈ బల్క్ డ్రగ్‌పార్క్‌ను రద్దుచేయాలని మత్స్యకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ ఎటువంటి హింసా త్మక సంఘటనలకు పాల్పడరాదన్నారు. అనుమ తులు లేకుండా ఆందోళనలు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని, గ్రామస్తులు సంయమనం పాటించాలన్నారు. మీ ఆందోళన కలెక్టర్, హోంమంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్‌డీవో వెంట తహసీల్దార్ నర్సింహమూర్తి, సీఐ కుమార స్వామి ఎస్‌ఐ సన్నిబాబు ఉన్నారు.
బెంగళూరు–కామాఖ్య
ఎక్స్‌ప్రెస్ దారిమళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్రన్ రైల్వే, అసన్ సోల్ డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో బెంగళూరు–కామాఖ్య–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. నవంబర్ 1, 8, 15, 22వ తేదీల్లో ఎస్‌ఎంవీటి బెంగళూరు–కామాఖ్య(12551) ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నవంబరు 5,12,19వ తేదీల్లో కామాఖ్య–ఎస్‌ఎంవీటి బెంగళూరు(12552) ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా అసన్‌సోల్, అండల్, సైంథియా స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.