
నూతన హైస్కూల్‌కు స్థల పరిశీలన
కొత్తగా ఏర్పాటు చేసే ముత్రాస్ కాలనీ హైస్కూల్ స్థల పరిశీలనలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
అనకాపల్లి: మండలంలోని కొత్తూరు పంచాయతీ ముత్రాస్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హైస్కూల్ స్థలాన్ని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైస్కూల్ భవనానికి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. తరగతి గదులు, ఆటస్థలానికి వీలుగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఎంపీడీవో ఆశాజ్యోతి, కొత్తూరు సర్పంచ్ సప్పారపు లక్ష్మీప్రసన్న, ఈవో సుభాష్, ఏఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.