
ప్రజాస్వామ్యమా?.. పోలీస్ రాజ్యమా?
7వ పేజీ తరువాయి
ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇలాంటి కంపెనీలను వవ్యతిరేకించి ఇప్పుడు ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. పోలీసుల మానవతా ధృక్పదంతో ఆలోచించి నిరసన తెలియజేయడానికి మత్స్యకారులకు సహకరించాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, మత్స్యకార నాయకుడు గోసలరాజశేఖర్, ఎరిపిల్లి నాగేశులు మాట్లాడుతూ ఆరు నెలల నుంచి బల్క్ డ్రగ్‌పార్క్‌కు వ్యతిరకేకంగా పోరాడుతున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా హోంమంత్రి అనిత ఒక్కసారి కూడా గ్రామంలోకి రాలేదన్నారు. అమాయకులైన మత్స్యకారులను ప్రభుత్వం బలిపశువులను చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకై నా తెగిస్తామని, బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు కానివ్వబోమని స్పష్టం చేశారు.ఈ ఆందోళనలో మత్స్యకారులు పిక్కి తాతీలు, మహేష్, ఎం.సూరిబాబు, పిక్కి కోదండరావు, పిక్కి గంగరాజు, యజ్జల అప్పలరాజు, పిక్కి రాంబాబు, పైడితల్లి, పిక్కరాజేష్, సోమేష్, కాశీరావు, సీఐటీయూ జిల్లాకార్యదర్శి ఎం.రాజేష్, రైతు సంఘనాయకులు సత్యనారాయణ వందలాది మంది మత్స్యకారులు మహిళలు పాల్గొన్నారు. సీఐ కుమార స్వామి, ఎస్‌ఐలు సన్నిబాబు, అంజు తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు.