
కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది
టెక్స్‌టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు.
– కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్, విశాఖపట్నం