
పట్టువదలని గంగపుత్రులు
నక్కపల్లి: మత్స్యకారుల పట్టు సడలలేదు. బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం రోజంతా ఉద్రిక్తత మధ్య గడిపిన రాజయ్యపేట మత్స్యకారులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. బల్క్‌డ్రగ్ పార్క్ కంటే ఉరే సరి అంటూ మెడలో ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. మత్స్యకారుల పొట్ట కొట్టే బల్క్‌డగ్ర్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరాహార దీక్షకు యత్నించడం, అనుమతి నిరాకరించిన పోలీసులు భవిష్యత్ కార్యాచరణకు సమావేశం కావడాన్ని అడ్డుకోవడం తెలిసిందే. 14 మందిపై కేసులు పెట్టడమే కాక ఆదివారం రాత్రి భారీ సంఖ్యలో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం కూడా నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్.రాయవరం సీఐ ఎల్.రామకృష్ణ, పాయకరావుపేట సీఐ అప్పన్న, ఎస్‌ఐ సన్నిబాబు, ట్రెయినీ ఎస్‌ఐ సాహిబ్ అంజు తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు రాజయ్యపేటలో మోహరించారు. తాము బల్క్‌డ్రగ్ పార్క్ అడ్డుకోలేదని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదని, అయినప్పటికీ అంతమంది పోలీసులు మోహరించి ఎక్కడకూ కదలకుండా అడ్డుకుంటున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ ఆందోళనకు మద్దతు తెలిపి మత్స్యకారులతోపాటు నిరాహారదీక్షలో కూర్చున్నారు.
హోం మంత్రి సమాధానం చెప్పాల్సిందే..
ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినపుడు వంగలపూడి అనిత ఓట్లు వేసి గెలిపించాలని కోరారని, ప్రమాదకర రసాయన పరిశ్రమలు రాకుండా గ్రామాన్ని కాపాడతానని హామీ ఇచ్చారని, తీరా ఆధికారంలోకి వచ్చిన తర్వాత తమ గోడు వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని మత్స్యకారులు వాపోయా రు. ఆమెను నమ్మి ఓట్లేసినందుకు బాగానే రుణం తీర్చుకుంటున్నారన్నారు. హోంమంత్రి తమ గ్రా మానికి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఆమె ఆదేశాలు లేకుండా వందలాది మంది పోలీసులు గ్రామంలోకి వస్తారా అని ప్రశ్నించారు. మంత్రికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. తా మంతా ప్రాణాలకు తెగించేందుకు సిద్ధంగా ఉన్నా మని కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ప్రాణాలు కాపాడుకుంటామన్నారు.
మత్స్యకారులకు న్యాయం చేయాలి
ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోవాలి. బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటయితే మత్స్యకారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. పార్టీలకతీతంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రాంత ఆడబిడ్డగా మంత్రి అనిత ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు న్యాయం చేయాలి.
– గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు
హోం మంత్రిదే బాధ్యత
మా ఆందోళనకు హోం మంత్రి అనిత వచ్చి సమాధానం చెప్పాల్సిందే. మీ ఆడపిల్లను గెలిపిస్తే అండగా ఉంటానని నమ్మించారు. ఇప్పుడు నిలబెట్టుకోవాలి కదా. రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఏం న్యాయం చేశారు. ఇంత వరకు మంత్రి మా గ్రామంలోకి రాలేదు. మా ప్రాణాలకేమైనా జరిగితే హోం మంత్రి బాధ్యత వహించాలి.
–కాశీరావు, మత్స్యకారుడు, రాజయ్యపేట
పార్టీ కంటే గ్రామస్తుల ప్రాణాలే ముఖ్యం
బల్క్‌డ్రగ్ పార్క్ రద్దు చేయాలని హోం మంత్రి అనితను కోరాం. న్యాయం చేస్తామ ని హామీ ఇచ్చారు. మాకు పార్టీ కంటే గ్రామస్తుల ప్రాణాలే ముఖ్యం. బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బంది పడతాం. గ్రామస్తులతోపాటు ఎటువంటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నాం. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కేసులు పెట్టడం తగదు.
–పిక్కి గంగరాజు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు
పోలీసులు చుట్టుముట్టినా
రెండో రోజూ కొనసాగిన దీక్ష
బల్క్‌డ్రగ్ పార్క్ కంటే ఉరే సరి
అంటూ నినాదాలు
మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన
హోం మంత్రి సమాధానం
చెప్పాల్సిందేనని స్పష్టీకరణ

పట్టువదలని గంగపుత్రులు

పట్టువదలని గంగపుత్రులు

పట్టువదలని గంగపుత్రులు

పట్టువదలని గంగపుత్రులు