
పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలా..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థపాలన కొనసాగుతుంది. మాట వినని అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. పచ్చపత్రికలు ఈ వాస్తవాలను ఎలాగూ ప్రజలకు చూపించరు. సాక్షి పత్రిక మాత్రమే నిర్భయంగా నిజాలను ప్రజలకు చేరవేస్తుంది. వీటిని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక సాక్షి పత్రికపై కేసులు నమోదు చేయడం, ఎడిటర్ ధనుంజయరెడ్డికి నోటీసులు అందించడం రాజ్యాంగ విరుద్ధం. పత్రికల గొంతునొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే. అలాంటి ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాధించలేవని చరిత్ర చూస్తే తెలుస్తుంది.
– మజ్జి శ్రీనివాసరావు,
వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్త