
వెంటాడుతున్న యూరియా కష్టాలు
మిగతా 8వ పేజీలో
● గరిశింగిలో అరకొర సరఫరాతో
రైతుల అవస్థలు
● స్వల్ప తోపులాటతో పోలీసుల రాక
● వారి పర్యవేక్షణలో ఎరువుల పంపిణీ
దేవరాపల్లి: అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో మహిళా, వృద్ధ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గరిశింగి రైతు సేవా కేంద్రం పరిధిలో 270 యూరియా బస్తాలు సోమవారం అందుబాటులోకి రాగా వీటిలో 80 బస్తాలను వాలాబు పంచాయతీకి, మరో 80 బస్తాలను చినగంగవరం గ్రామానికి కేటాయించారు. మిగిలి ఉన్న 110 యూరియా బస్తాల కోసం గరిశింగితోపాటు డొర్రి చెరువు, కించుమండ, కొత్తూరు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతులు రెట్టింపు సంఖ్యలో ఉండగా సరఫరా మాత్రం అరకొరగా ఉండటం రైతుల మధ్య స్వల్ప తోపులాటకు దారితీసింది. స్థానిక వ్యవసాయ సిబ్బంది పోలీస్‌లకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వి.సత్యనారాయణ తక్షణమే తన సిబ్బందితో గరిశింగి చేరుకున్నారు. టోకెన్‌ల ప్రకారం రైతులను క్యూలైన్‌లో ఉంచి యూరియాను పంపిణీ చేయించారు. అరకొరగా యూరియా సరఫరా చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేయడం తగదని ప్రభుత్వ తీరుపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యూరియా బస్తా కోసం