
పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడం అవివేకం
పత్రికలనేవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. అటువంటి పత్రికా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష సాధించడం దారుణం. రాజకీయ పార్టీ నాయకుడి ప్రెస్‌మీట్‌ను వార్త రూపంలో రాస్తే పాత్రికేయుడిపైన, సాక్షి ఎడిటర్‌పైన కేసులు నమోదు చేయడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పత్రికా వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కూటమి ప్రభుత్వం విష సంస్కృతికి తెర లేపుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని చూడటం మానుకోవాలి. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
–కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే

పత్రికా స్వేచ్ఛను అణగదొక్కడం అవివేకం