
హాసిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి
ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేస్తున్న
మృతి చెందిన హాస్టల్ విద్యార్థిని తల్లి నాగమణి
నర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ వసతిగృహంలో తన కుమార్తె హాసి ని మరణించిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విద్యా ర్థిని తల్లి నాగమణి ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేశారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న విషయం తన కుమార్తె హాస్టల్ సిబ్బందికి తెలియపరిచినా తనకు చెప్పలేదని బాధితురాలు ఆర్డీవోకు వివరించారు. రాత్రి కడుపు నొప్పి వస్తే శుక్రవారం ఉదయం వరకు హాస్పిటల్‌కు తీసుకువెళ్లకపోవటం వల్ల తన కుమార్తె చనిపోయిందని కంటతడి పెట్టారు. అదే రాత్రి హాసిని ఉంటున్న రూమ్‌లోకి పాము వస్తే బయట వారితో కొట్టించారని తన చిన్న కుమార్తె చెప్పిందని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.